ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియా రికార్డ్​- రోబోతో విమానం డ్రైవింగ్​! - ఎయిర్​ ఇండియాలో రోబో

విమానాల్లో మొట్టమొదటిసారి ట్యాక్సీబాట్​ సేవలు వినియోగించిన సంస్థగా నిలిచింది ఎయిర్​ ఇండియా. రోబో సాయంతో పనిచేసే ఈ ట్రాక్టర్​ ద్వారా విమానం ఇంజిన్​ ఆన్​ చేయకుండానే రన్​వే వరకు తీసుకొచ్చేందుకు వీలుపడుతుంది.

ఎయిర్​ ఇండియా రికార్డ్​- రోబోతో విమానం డ్రైవింగ్​!
author img

By

Published : Oct 15, 2019, 4:18 PM IST

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో 'ట్యాక్సీబాట్​' సేవలు వినియోగించిన మొట్టమొదటి విమానయాన సంస్థగా నిలిచింది. ట్యాక్సీబాట్​ సాయంతో.. ప్రయాణికులు ఉన్న విమానాన్ని పార్కింగ్ ​బే నుంచి రన్​వే వరకు విజయవంతంగా తీసుకొచ్చింది.

ఎయిర్​ ఇండియా ఛైర్మన్​, మేనేజింగ్ డైరెక్టర్​ అశ్వినీ లోహణి ఇవాళ ఉదయం దిల్లీ విమానాశ్రయంలో ట్యాక్సీబాట్​ సేవలు ప్రారంభించారు. ముంబయి వెళ్తున్న ఏఐ665 విమానాన్ని.. టెర్మినల్​-3 నుంచి రన్​వే వరకు ట్యాక్సీబాట్​ విజయవంతంగా తీసుకొచ్చింది.

ట్యాక్సీబాట్​ అంటే?

రోబో సాయంతో నడిచే ఎయిర్​క్రాఫ్ట్​ ట్రాక్టర్​ను ట్యాక్సీబాట్​ అంటారు. అయితే ఈ రోబో... పైలట్ నియంత్రణతో పనిచేస్తుంది. ట్యాక్సీబాట్​ సాయంతో విమానం ఇంజిన్ ఆన్ చేయకుండానే.. పార్కింగ్​బే నుంచి రన్​వే వరకు, అలాగే రన్​వే నుంచి పార్కింగ్​ బే వరకు తీసుకురావొచ్చు. దీని ద్వారా ఎంతో విలువైన ఇంధనం ఆదా అవుతుంది.

ప్రస్తుతానికి దిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే(డిపార్ట్​) విమానాల కోసమే ట్యాక్సీబాట్​ సేవలు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : భారత్​కు ఫిదా- యునెస్కో నాలుగు అవార్డులు

Intro:Body:

huiu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.