ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో మరో కరోనా యోధుడు మృతి - కొవిడ్-19 లక్షణాలు

మరో కరోనా యోధుడు వైరస్ ధాటికి బలయ్యాడు. దిల్లీ ఎయిమ్స్​కు చెందిన పారిశుద్ధ్య విభాగానికి చెందిన అధికారి ఆదివారం మరణించినట్లు వైద్యులు తెలిపారు.

AIIMS sanitation supervisor dies due to COVID-19
దిల్లీ ఎయిమ్స్​లో మరో కరోనా వారియర్ మృతి
author img

By

Published : May 25, 2020, 6:11 PM IST

దిల్లీలోని ఎయిమ్స్​ పారిశుద్ధ్య విభాగానికి చెందిన పర్యవేక్షక అధికారి కరోనా వైరస్​తో మరణించారు. పరిస్థితి విషమించడం వల్ల ఆయనను వెంటిలేటర్​ మీద ఉంచి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రమవడం వల్ల ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

"మరో కరోనా యోధుడు దేశ సేవ కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. ఓ గొప్ప యోధుడిని ఎయిమ్స్ కోల్పోయింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది, ఎవరినీ వదలడం లేదు."

-కుల్దీప్ ధిగాన్, ఎయిమ్స్ జనరల్ సెక్రెటరీ

జ్వరం, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపించడం వల్ల సదరు పర్యవేక్షకుడు మే 16న ఎయిమ్స్​లోనే పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు కుల్దిప్. అతని కేసు కొవిడ్ పరీక్షల పరిధిలోకి రాలేదని.. సాధారణ చికిత్స నిర్వహించి ఇంటికి పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత లక్షణాలు తీవ్రం కావడం వల్ల మే 19న అతడిని ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో వైరస్​ పోరాటంలో ముందువరుసలో ఉన్న వారందరికీ.. కాస్త అనుమానాలు వచ్చినా పరీక్షలు చేయాలని అన్నారు కుల్దీప్. సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైద్య సేవల సిబ్బందికి వైరస్ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది సమస్యలపై చర్చించడానికి ఎయిమ్స్​ డైరెక్టర్​తో మంగళవారం సమావేశం కానున్నట్లు తెలిపారు.

గత వారం ఎయిమ్స్​లోని ఆర్​పీసీ క్యాంటీన్​కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.