ఈ ఏడాది నవంబర్ 10లోపు.. తమ అడ్మిషన్లను ఉపసహరించుకునే విద్యార్థులకు పూర్తి ఫీజు రీఫండ్ చేయాలని.. అనుబంధ సంస్థలను ఆదేశించింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ). ఈ పూర్తి ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను జారీ చేసింది.
"2020 నవంబర్ 10లోపు అడ్మిషన్లు ఉపసంహరించుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజు(రూ.1000) మినహా విద్యార్థుల నుంచి సేకరించిన పూర్తి రుసుమును తిరిగి ఇచ్చేయాలి."
--- ఏఐసీటీఈ నోటిఫికేషన్.
దీనితో పాటు విద్యార్థుల సర్టిఫికెట్ల పత్రాలను కూడా వెనక్కి తిరిగిచ్చేయమని ఆదేశించింది ఏఐసీటీఈ.
కరోనా సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని.. అనుబంధ సంస్థలు అందించే ఎమ్బీఏ, పీడీజీఎమ్ కోర్సులకు కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. పారదర్శకత ఉండేలా పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్టును రూపొందించాలని స్పష్టం చేసింది. అయితే.. సీట్ల కేటాయింపులో ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులకే(ఏదైనా రాష్ట్రంలో ఈ పరీక్షలు జరిగి ఉంటే) తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
ఇదీ చూడండి:- డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు