గుజరాత్ అహ్మదాబాద్ ప్రజల మెట్రో కల సాకారమైంది. మొదటి దశ మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్ మెట్రోలో ప్రయాణించారు మోదీ. రెండో దశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ప్రస్థుతానికి వస్త్రాల్ నుంచి అప్పరెల్ పార్క్ మధ్య మొత్తం 6.5 కిలోమీటర్ల దూరం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 40 కిలోమీటర్ల మొదటిదశలో పూర్తయిన ఈ 6.5కి.మీ మార్గం మాత్రమే ప్రారంభించారు.
మొదటి దశ
రెండు కారిడార్లు: వస్త్రాల్ నుంచి థాల్తేజ్ ఘామ్, గ్యాసాపూర్ డిపో నుంచి మొతెరా మైదానం
మొత్తం: 40కిలోమీటర్లు
అండర్‌గ్రౌండ్: 6.5 కిలోమీటర్లు
ఆకాశమార్గం: 33.5కిలోమీటర్లు
రెండో దశ నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొతెరా క్రికెట్ మైదానం నుంచి గాంధీనగర్‌లోని మహాత్మ మందిర్ వరకు మొత్తం 28కిలోమీటర్లతో రెండో దశ ప్రణాళిక రూపొందించారు.