మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.19 వేల కోట్లతో ముంబయిలో చేపట్టనున్న మూడు మెట్రో కారిడార్లకు (గైముఖ్ -శివాజీ చౌక్, వాదాలా-సీఎస్‌టీ, కళ్యాణ్-తాళోజా) భూమిపూజ చేయనున్నారు మోదీ.
పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 'ఆరే' ప్రాంతంలో మెట్రో భవన్‌కూ శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. 'ఆరే' ప్రాంతం ముంబయికి ఊపిరితిత్తుల లాంటిదని.. ఇక్కడ మెట్రో భవన్ నిర్మిస్తే పచ్చని ప్రాంతం కనుమరుగవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల చెట్లు ఉన్న ఈ ప్రాంతంలో మెట్రో పనులు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల చెట్ల నరికివేతనూ అడ్డుకున్నారు పర్యావరణ ప్రేమికులు.
ఔరంగాబాద్‌లోనూ పర్యటించనున్న మోదీ.. ఇక్కడ రాష్ట్రస్థాయి మహిళా స్వయం సహాయక సంఘాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇదీ చూడండి: 'దాడి చేస్తే జీవితంలో మరిచిపోలేని సమాధానమిస్తాం'