ETV Bharat / bharat

నేడే స్వదేశానికి భీకర 'రఫేల్'​ రాక.. భద్రత కట్టుదిట్టం! - IAF today news

యావత్​ భారతవని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రఫేల్​ యుద్ధ విమానాలు బుధవారం దేశంలో అడుగుపెట్టనున్నాయి. భారత వాయుసేన అధినేత ఆర్​కేఎస్​ బదౌరియా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. సెక్షన్​-144 విధించారు.

Ahead of arrival of Rafale jets, security tightened, Section 144 imposed near Ambala air base
స్వదేశానికి భీకర 'రఫేల్'​ రాక.. భద్రత కట్టుదిట్టం!
author img

By

Published : Jul 29, 2020, 5:17 AM IST

రఫేల్ రాక కోసం ఎదురుచూస్తోన్న యావత్ భారతావని కళ నెరవేరింది. శత్రుదుర్భేద్యమైన యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో నేడు చేరనున్నాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో అడుగుపెట్టనున్నాయి. ఈ తరుణంలో.. హై అలర్ట్​ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అంబాలా ఎయిర్​బేస్​ పరిసర ప్రాంతాలలో మంగళవారం నుంచే 144 సెక్షన్​ విధించింది. ఫొటోలు, వీడియోలకు అనుమతి నిరాకరించిన జిల్లా అధికారులు.. ఆ ప్రాంతంలో కనీసం మూడు కిలోమీటర్ల వరకూ డ్రోన్​లను కూడా నిషేధించింది.

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత్​కు చేరుకుంటాయని వైమానికదళ అధికారులు తెలిపారు. అంతకుముందే ఎయిర్​చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా అక్కడికి చేరుకుంటారని చెప్పారు. తొలి బృందంలో భారత్​కు వస్తోన్న 5 రఫేల్​ జెట్​లను బదౌరియా అందుకోనున్నట్లు తెలిపారు.

సోమవారం ఫ్రాన్స్​లో బయల్దేరిన 5 రఫేల్​ యుద్ధ విమానాలు.. సుమారు 7 వేల కిలో మీటర్లకుపైగా ప్రయాణించి.. ఇవాళ (జులై 29)న అంబాలా విమానాశ్రయంలో అడుగిడనున్నాయి. రఫేల్​ యుద్ధ విమానాలు అంబాలాకు చేరుకున్న అనంతరం.. భారత వైమానిక దళం(ఐఏఎఫ్​)లో అధికారిక లాంఛన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఐఏఎఫ్​లో పోరాట సామర్థ్యం పెంచేందుకు గానూ.. ఫ్రాన్స్​తో 36 రఫేల్​ జెట్​లకు ఒప్పందం కుదుర్చుకుంది భారత్​. ఈ మేరకు రూ. 59వేల కోట్లు చెల్లించనుంది.

ఇవీ చదవండి:

భారత్ అమ్ములపొదిలో రఫేల్.. శత్రువు గుండె గుభేల్

గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

రఫేల్​ రాకతో.. గగనతలంలో సవాళ్లకు భారత్​ సిద్ధం!

ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.