ETV Bharat / bharat

ఆగ్రా బస్​ హైజాక్​ ప్రధాన నిందితుడు అరెస్ట్​

ఉత్తర్​ప్రదేశ్​లో ప్రైవేటు బస్సు హైజాక్​ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో బస్సు హైజాక్​ నిందితుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Agra bus 'hijack
ఆగ్రా బస్​ హైజాక్​ ప్రధాన నిదింతుడు అరెస్ట్​
author img

By

Published : Aug 20, 2020, 11:09 AM IST

Updated : Aug 20, 2020, 12:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో కలకలం రేపిన ప్రైవేటు బస్సు హైజాక్​ ఘటనలో పురోగతి సాధించారు పోలీసులు. ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఫతేబాద్​ పోలీసులు ఫిరోజాబాద్​ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో.. హైజాక్​ ఘటనలో ప్రధాన నిందితుడితోపాటు అతని అనుచరుడు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు గాయపడగా.. మరొకరు పరారయ్యాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Agra bus 'hijack
ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం

పోలీసులకు పట్టుబడిన దుండగుడు.. ప్రదీప్​ గుప్తాగా గుర్తించారు. ఆగ్రా బస్​ హైజాక్​లో పాలుపంచుకున్నట్లు తెలిపారు.

బస్సు హైజాక్​ కేసులో గుప్తాను స్థానిక పోలీసులతో పాటు క్రైమ్​ బ్రాంచ్​ అధికారులు విచారిస్తున్నారు.

Agra bus 'hijack
ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో పోలీసులు

ఇదీ చూడండి: హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్

Last Updated : Aug 20, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.