ఇదీ చూడండి:భారత్ భేరి: "నీది, నాది ఒకే కథ..!"
సార్వత్రిక సమరం వచ్చింది. కేరళలో ఎవరిని పలకరించినా వరదలు, అందుకు కారణమైన వాతావరణ మార్పునే ఎన్నికల ప్రధానాంశంగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలు మారనంత వరకు న్యాయం జరగదనే అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ఓటర్లు. ఈ సమస్యకు పరిష్కారమే ధ్యేయంగా, హామీగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే ప్రచారానికి వచ్చిన నేతకు ఓటర్ల ప్రశ్న. వాతావరణ మార్పు నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
'రాబోయే ఎన్నికల్లో వాతావరణ మార్పు ప్రధాన చర్చాంశంగా ఉండాలని 100 శాతం భావిస్తున్నాను.'
- అరుణ్ కె. నాయర్, సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, కొచ్చి
కేరళ ప్రభుత్వ నివేదిక ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో 16.6 శాతం మంది ప్రత్యక్షంగా వరదల ప్రభావానికి లోనయ్యారు. సుందరమైన కేరళ రాష్ట్రం పునరుద్ధరణ,
పునర్నిర్మాణం కోసం రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి.
'వరదల సమయంలో పునరావాస, సహాయక చర్యలు.. యువత చేసినప్పుడే రాజకీయ నేతల అసమర్థత బయటపడింది. అసాధారణ రాజకీయ నిర్ణయాలే ఈ మానవ కారక విపత్తుకు కారణం. 22 జలాశయాల్ని ఒకదాని వెంబడి ఒకటి విడుదల చేశారు. ఎందరో ప్రాణాలు కోల్పోవడమే కాక వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ రాజకీయ చర్చాంశాలు, ఆలోచనా ధోరణి మారనంత వరకు ప్రజలకు న్యాయం జరగదు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించగలిగే విధేయత గల నేతలున్నారా?'
- కేఎస్ మను, రచయిత, తిరువనంతపురం
వరదల కారణంగా కేరళ ప్రజానీకం ఎంతో కోల్పోయింది. ఆ సమస్య నుంచి దృష్టిమరల్చేందుకే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు తెరపైకి తెచ్చారన్నది కొందరి విమర్శ.
"ప్రభుత్వం ఏ పార్టీదైనా... ప్రకృతి విపత్తు అంటే నిధులు. నిధులు అంటే లంచాలు, దుర్వినియోగం.
రాజకీయాల్లో పరివర్తన రానంతవరకు ప్రజలకు న్యాయం జరగదు. ఆ మార్పునకు హరిత రాజకీయాలు, సంక్షేమ రాజ్యానికి సంబంధించిన ఆధునిక విధానాలే పునాదులు కావాలి."
- కేఎస్ మను, రచయిత, తిరువనంతపురం
ఇవీచూడండి: