ఉత్తరప్రదేశ్‌లో సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన రాజకీయ దుమారం చెలరేగింది. తాజా పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ఘటన జరిగిన గ్రామాన్ని సందర్శించనున్నారు.
భూవివాదంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 10 మంది కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలను బాధితులను అడిగి తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు.
ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిని కూడా ఆదిత్యనాథ్ పరామర్శించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'