ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 31 లక్షల మంది క్వారంటైన్​లోనే!

author img

By

Published : Jul 17, 2020, 10:51 PM IST

దేశంలో కరోనా వైరస్ తన పరిధిని పెంచుకుంటోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో బాధితుల కంటే క్వారంటైన్​లో ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా క్వారంటైన్​లో ఉన్నట్లు వెల్లడించారు.

above 30 Lakh People In Quarantine across in India

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 25వేలకు చేరింది. మరోవైపు క్వారంటైన్‌లో ఉంటున్న వారి సంఖ్యా గణనీయంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఈ విధంగా 30 లక్షలకు పైగా ఉంటున్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. కరోనా అనుమానితులు, కరోనా లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు తదితరులు సంస్థాగత లేదా హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు వెల్లడించాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 లక్షల మంది, కేసుల పరంగా దేశంలోనే తొలి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో మొత్తం 7.27 లక్షల మంది క్వారంటైన్‌లో ఉంటున్నారు. మొత్తంగా 31 లక్షల మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం మాత్రం హోంక్వారంటైన్‌కు అనుమతివ్వడం లేదు. మరోవైపు దిల్లీ, తెలంగాణలో స్వల్ప లక్షణాలు ఇంట్లోనే ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. దిల్లీ, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అరికట్టడంలో ముందంజలో ఉన్నాయని, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హోంశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.