ETV Bharat / bharat

తొలిరోజు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా - 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందింకి వ్యాక్సిన్​

కరోనా టీకా పంపిణీ తొలిరోజున దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే.. వ్యాక్సినేషన్​పై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

COVID-19 inoculation drive
కరోనా టీకా పంపిణీ
author img

By

Published : Jan 14, 2021, 10:34 AM IST

దేశంలో కరోనా టీకా పంపిణీ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రాలకు వ్యాక్సిన్లు చేరుకుంటున్నాయి. తొలిరోజు దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందించనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ఇందుకోసం మొత్తం 2,934 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించాయి.

ఒక్కో సెషన్​లో గరిష్ఠంగా 100 మందికి టీకా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రోజులో ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నించొద్దని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. వ్యాక్సినేషన్​ ప్రక్రియ సజావుగా సాగుతున్న క్రమంలో టీకా సెషన్స్​ను పెంచుకుంటూ పోవాలని కోరింది. అలాగే.. ప్రతి సెషన్​లో 10 శాతం టీకాలు రిజర్వ్​ లేదా వృథాగా పరిగణించాలని పేర్కొంది.

"జనవరి 16న దేశవ్యాప్తంగా 2,934 కేంద్రాల్లో సుమారు 3 లక్షల మంది కరోనా యోధులకు టీకా అందించనున్నాం. అయితే.. రెండు టీకాల్లో ఏది తీసుకోవాలనేది ఎంచుకునే వీలులేదు. "

- కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారవర్గాలు

ప్రస్తుతం 1.65 కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసింది కేంద్రం. అందులో 1.1 కోట్ల డోసులు కోవిషీల్డ్​, 55 లక్షలు కొవాగ్జిన్​ డోసులు ఉన్నాయి. ఇప్పటికే 2.4 లక్షల కొవాగ్జిన్​ డోసులు 12 రాష్ట్రాలకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి: టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.