ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జరుపుతున్న పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించిన అద్భుత ఉపయోగంగా దీనిని అభివర్ణించారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వ్యాప్తి గురించి సమాచారం తెలుసుకోవడం సహా చుట్టుపక్కల ఎవరైనా వైరస్ బారిన పడ్డవారు ఉంటే.. వెంటనే మనకు తెలియజేస్తుందని తెలిపారు.
-
Aarogya Setu is an important step in our fight against COVID-19. By leveraging technology, it provides important information. As more and more people use it, it’s effectiveness will increase. I urge you all to download it.https://t.co/VaiPIjhxM2https://t.co/8Irj6ApmOQ pic.twitter.com/L91vaLlCCq
— Narendra Modi (@narendramodi) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aarogya Setu is an important step in our fight against COVID-19. By leveraging technology, it provides important information. As more and more people use it, it’s effectiveness will increase. I urge you all to download it.https://t.co/VaiPIjhxM2https://t.co/8Irj6ApmOQ pic.twitter.com/L91vaLlCCq
— Narendra Modi (@narendramodi) April 8, 2020Aarogya Setu is an important step in our fight against COVID-19. By leveraging technology, it provides important information. As more and more people use it, it’s effectiveness will increase. I urge you all to download it.https://t.co/VaiPIjhxM2https://t.co/8Irj6ApmOQ pic.twitter.com/L91vaLlCCq
— Narendra Modi (@narendramodi) April 8, 2020
పలు రాష్ట్రాల హెల్ప్‌డెస్క్ నంబర్లు సైతం యాప్‌లో అందుబాటులో ఉంటాయని ప్రధాని వెల్లడించారు. కొవిడ్-19 గురించి భయపడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మోదీ. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారిపై పోరాటం చేయాలని సూచించారు. ఆ దిశగా.. ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ఓ ముందడుగుగా అభివర్ణించారు. ఆన్‌లైన్ స్టోర్లలో యాప్ డౌన్‌లోడ్ లింక్‌లను సైతం ప్రధాని షేర్ చేశారు.
ఇదీ చూడండి: దేశంలో 169కి చేరిన కరోనా మరణాలు