ETV Bharat / bharat

''నమో' టీవీ ప్రసారాలను నిలిపేయండి' - కాంగ్రెస్

ఇటీవలే ప్రారంభమైన 'నమో టీవీ'పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమ్​ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నపుడు ఒక రాజకీయ పార్టీ ఛానల్​ ప్రారంభించడం నిబంధనల అతిక్రమణ కాదా అని లేఖలో పేర్కొంది. ఈ టీవీ ప్రసారాలను నిలిపివేసేలా ఆదేశించాలని ఈసీని కోరింది మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ.

''నమో' టీవీ ప్రసారాలను నిలిపేయండి'
author img

By

Published : Apr 1, 2019, 9:47 PM IST

Updated : Apr 1, 2019, 11:51 PM IST

నమో టీవీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశాలతో కూడిన 'నమోటీవీ' ప్రారంభంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది.

ఎన్నికల కోడ్​ అమలులో ఉండగా ఒక రాజకీయ పార్టీ ప్రత్యేక ఛానల్​ను ఏర్పాటు చేయడం ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం కాదా అని ఈసీని ప్రశ్నించింది.

  • AAP complaint against NAMO TV to Election Commission of India.
    How is this channel running ?
    Who gave permission?
    Whether EC knows about any such channel ?? pic.twitter.com/VV9KMZpBIf

    — Vikas Yogi (@vikaskyogi) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నపుడు ఒక రాజకీయ పార్టీ సొంత ఛానల్​ను స్థాపించేందుకు అనుమతించవచ్చా? ఒకవేళ ఈసీ అనుమతులు లేకపోతే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఛానల్​ను ప్రారంభించేందుకు భాజపాకు మీడియా ధ్రువీకరణ​ కమిటీ (ఎంసీసీ) ఆమోదం తెలిపిందా?
ఎంసీసీ అనుమతులు లేకుండానే ఛానల్ ప్రారంభమైతే షోకాజ్​ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు? న్యాయ ప్రమాణాల ప్రకారం డబ్బు, అధికారంతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్లను చేరుకునేందుకు సమాన అవకాశాలు ఉండాలి. ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించిన భాజపా 24 గంటల ప్రసారాలతో 'నమో టీవీ'ని ప్రారంభించింది."

-ఈసీకి లేఖలో ఆమ్​ ఆద్మీ పార్టీ

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫిర్యాదు

'నమో టీవీ' ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భాజపా.. ఛానల్​ను ప్రారంభించిందని మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలాభ్​ శుక్లా ఆరోపించారు.

ఇదీ చూడండి:హిందువులను తీవ్రవాదులు అంటారా?: మోదీ

Special Advisory
Monday 1st April 2019
Clients, please note the following fixture has not taken place so do not anticipate highlights.
SOCCER: AFC Cup, Group A, Hilal Al Quds Club v Nejmeh SC.
Regards,
SNTV
Last Updated : Apr 1, 2019, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.