ETV Bharat / bharat

కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..! - kerala

కేరళ రాజధాని తిరువనంతపురంలో వింత సంఘటన జరిగింది. పొరుగింటి కుక్కతో సంబంధం పెట్టుకుందని పొమెరేనియన్​ బ్రీడ్​కు చెందిన ఓ శునకాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లారు యజమాని.

కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!
author img

By

Published : Jul 24, 2019, 10:28 AM IST

కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

పరువు కోసం కొందరు ప్రాణాలను సైతం లెక్క చేయరు. తమ కూతురో, కొడుకో.. ఎవరైనా తల్లిదండ్రులకు నచ్చని విధంగా ప్రేమ వివాహం చేసుకుంటే కోపంతో ఊగిపోతారు. బిడ్డపై ప్రేమ కన్నా పరువే ముఖ్యమనుకుంటారు. ఇంట్లో నుంచి పంపించేస్తారు. కొందరైతే చంపించేస్తారు. ఇక అక్రమ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కారణంగా మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జంతువులకూ ఆ సమస్య తలెత్తింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ పొమెరేనియన్​​ జాతికి చెందిన శునకం... పక్కింటి కుక్కతో సంబంధం పెట్టుకుందని దాని యజమానికి కోపం వచ్చింది. పరువుకు సంబంధించిన విషయం అనుకున్నారో ఏమో... వెంటనే ఆ శునకాన్ని రోడ్డు మీద వదిలి వెళ్లిపోయారు.

అక్రమ సంబంధం వల్లే....

తిరువనంతపురంలో రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో ఉన్న పొమెరేనియన్​ జాతి శునకాన్ని స్థానికులు గమనించారు. అనంతరం జంతు పరిరక్షణ వాలంటీర్​కు సమాచారం అందించారు. ఆ శునకాన్ని అక్కున చేర్చుకున్న వాలంటీర్​కు దాని మెడలో ఓ లేఖ కనపడింది.

'ఈ శునకం ఎంతో మంచిది. ఆహారం ఎక్కువ తినదు. ఇది పొరుగింటి కుక్కతో సంబంధం పెట్టుకుందనే కారణంతోనే దీన్ని వదిలేస్తున్నా' అని ఆ లేఖలో ఉంది.

లేఖ చదివిన అనంతరం ఆశ్చర్యానికి గురైనట్టు వాలంటీర్​ పేర్కొన్నారు.

"కుక్కలను రోడ్లపై వదిలేసి వెళ్లడం సమస్యకు పరిష్కారం కాదు. ఎన్నో వీధి శునకాలు రోడ్లపై సంచరిస్తున్నాయి. వాటిని నియంత్రించేందుకు కార్పొరేషన్​ ప్రయత్నిస్తోంది. నగరంలో ప్రధాన సమస్య ఇది. మీకు నిజంగా పెంపుడు కుక్క వల్ల సమస్య వస్తే.. దానిని వేరే వాళ్లకు అప్పగించండి. వదిలేయడం సరికాదు. అమానవీవయం.

-శమీమ్​, జంతు పరిరక్షణ వాలంటీర్​​.

అక్రమ సంబంధం కారణంతో శునకాన్ని వదిలేయడాన్ని శమీమ్​ తప్పుపట్టారు. ఆ యజమానికి శునకాల మీద కనీస అవగాహన లేదన్నారు.

AP Video Delivery Log - 0100 GMT News
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2343: US Pelosi Pakistan AP Clients Only 4221822
Pakistan PM: Time to reset relationship with US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.