మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్‌ను స్పెషల్ సెల్ అధికారులు జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో అరెస్ట్ చేశారు. ఈ కరుడుగట్టిన తీవ్రవాదిపై గతంలో దిల్లీ పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అతడిపై రూ.2 లక్షల రివార్డ్ కూడా ఉంది.
2015 నుంచి ఫయాజ్ను పట్టుకోవడానికి సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇవాళ ఈ కరుడుగట్టిన ఉగ్రవాది, స్పెషల్ సెల్ అధికారులకు చిక్కాడు.
ఇదీ చూడండి:అరుణ్ జైట్లీ నకిలీ సంతకంతో భారీ మోసం!