ETV Bharat / bharat

స్ఫూర్తి: ఎదురీత ముందు విధిరాత ఎంత? - స్ఫూర్తి కథనం

విధి తనను వికలాంగుడ్ని చేసింది. అయితే... అతని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. ఒకరి ముందు చేయి చాచకుండా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. ఇంటి అద్దె, పిల్లల చదువులకు తనే ఆధారం. 12 ఏళ్లుగా వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాడు ఖైరతాబాద్​ మల్లేశ్‌. స్వయంకృషితో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

A  specially abled person inspirational story from Hyderabad
స్ఫూర్తి: ఎదురీత ముందు విధిరాత ఎంత?
author img

By

Published : Oct 11, 2020, 1:03 PM IST

స్ఫూర్తి: ఎదురీత ముందు విధిరాత ఎంత?

అతని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. విధి తనను వికలాంగుడ్ని చేసినా ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుడుగు వేశాడు. ఎవరి వద్ద చేయి చాచకుండా నిస్సహాయ స్థితిలోనూ కులవృత్తినే నమ్ముకొని జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చెప్పులు కుట్టగా వచ్చే డబ్బులతో ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుంటూ వారి ఆలనపాలన చూసుకుంటున్నాడు. తనే ఖైరతాబాద్​కు చెందిన అమీర్ పూర్ మల్లేశ్. ఎదురీత ముందు విధిరాత ఎంత అని ప్రశ్నిస్తోన్న మల్లేశ్​ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

A  specially abled person inspirational story from Hyderabad
కుల వృత్తి చేస్తున్న మల్లేశ్​

ఖైరతాబాద్​కు చెందిన మల్లేశ్​ చిన్నప్పటి నుంచి కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాడు. తల్లితోపాటు సచివాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై చెప్పులుకుట్టుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. మొదట్లో హాయిగా సాగిపోయిన మల్లేశ్‌ జీవితానికి మధుమేహ వ్యాధి రూపంలో విధి పరీక్ష పెట్టింది. కొద్దిరోజులు మంచానికే పరిమితమయ్యాడు. నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజం లేదు. చివరకు ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రెండేళ్లు గడవకముందే మరోకాలు కూడా పోయింది. రెండు నెలల పాటు కులవృత్తికి దూరమయ్యాడు. అయినా తను మాత్రం కుంగిపోలేదు.

మల్లేశ్​ కుటుంబం

"ఈ పని నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. మధ్యలోనే ఇలా అయిపోయింది. షుగర్ వల్ల కాలు తీసేశారు. మొదట ఎడమ కాలు పోయింది. రెండేళ్ల తర్వాత కుడికాలు పోయింది. ఏం చేయాలి?

ఆస్పత్రి పాలై పదిసార్లు పోయి పదిసార్లు వచ్చాను. మంచిగా అవుతుందేమో అని చూశాను. నయం కాలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. ఏం చేయాలి? మా అమ్మ ఒక్కామే నన్ను చూసింది. ఆమెనే నాకు సేవ చేసింది. బతకాలి అనుకుంటే తప్పదు కదా సర్‌. చేయాలి నడుస్తుంది. ఇదే పని చేస్తున్నా. దీని మీదనే బతుకుతున్నాను."

- మల్లేశ్, దివ్యాంగుడు, ఖైరతాబాద్

తన కష్టంతోనే కుటుంబానికి అన్ని సమకూర్చుకుంటున్న మల్లేశ్.. అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కుమార్తెలు వైష్ణవి, శిరీషలను ఖైరతాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాడు. రెండు కాళ్లు పోయాయన్న సంగతిని మరిచిపోయి కుటుంబానికి జీవనాధారమైన కులవృత్తిని నమ్ముకొని మళ్లీ దుకాణం తెరిచాడు. ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పాదచారుల వంతెనపై పనిచేసుకుంటూ వచ్చే డబ్బులతో తన పిల్లల బంగారు భవిష్యత్​కు బాటలు వేస్తున్నాడు.

"గుబులేం లేదు నాకు. పని చేస్తున్నా. బతుకుతున్నా. ఏదో వచ్చిన కాడికి ఇల్లు నడుపుకుంటున్నా. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను. వాళ్లు చదువుకుంటున్నారు. వాళ్ల గురించే నేను ఈ పని చేసేది. రోజుకు రూ.100 -150వస్తాయి. దాని మీదనే బతకాలి మేము. మాకు బయట వేరే ఆదాయం ఏమీ లేదు. ఇదే పని చేయాలి. దీని మీదనే బతకాలి. ఎవ్వరేం సాయం చేయలేదు సార్ నాకు. ఇప్పటి వరకు ఎవరూ ఏమీ సాయం చేయలేదు. ఇలానే ఉంటున్నా. ఆటోలో వస్తా. ఆటోలో పోతా.

- మల్లేశ్

విధి వికలాంగుడిగా మార్చినా అధైర్యపడని మల్లేశ్ ఎవరి వద్ద చేయిచాచి అడగడు. ఎవరైనా సాయం చేస్తే వద్దనడు. అయితే తనపై సానుభూతితో కాకుండా తోటి మనిషికి సహాయం చేయాలి అన్న మానవత్వంతో ఆదుకోవాలని మల్లేశ్ కోరుతున్నాడు. ప్రస్తుతం తన కష్టానికి తోడు ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛనుతో కుటుంబాన్ని పోషించుకుంటోన్న మల్లేశ్... రెండు నెలలకు ఒకసారి తీవ్రమైన జ్వరంతో ఇబ్బందిపడుతుంటాడు. అయినా తన ఇద్దరు పిల్లలకు తన కష్టాలేవీ తెలియకుండా పెంచుతున్నాడు. కష్టేఫలి అన్న నినాదంతో బతుకుబండి లాగిస్తున్నాడు.

"వాళ్లను మంచిగా చూడాలని అనిపిస్తుంది కానీ నా దగ్గర డబ్బేం లేదు. వచ్చిన ఆదాయంతోనే నడిపిస్తున్నా. మనకు వచ్చేది ఇంత, మన అవసరాలు ఇవి అని పిల్లలకు కూడా చెప్పాను. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, అంతకు మించి ఏం కోరుకోవద్దని చెబుతుంటా. వాళ్లు ఎప్పుడైనా బాధ పడితే సముదాయిస్తా. అవసరాలు - ఆదాయం గురించి వివరించి వచ్చినదాంతోనే సర్దుకోవాలని చెబుతా. ఎక్కువ ఆశ పడొద్దు, ఎదుటి వాళ్లు అలా చేస్తున్నారు కదా అని వాళ్లను చూసి ఏమీ అడగవద్దంటా."

- మల్లేశ్

12 ఏళ్లుగా ఏ మాత్రం అధైర్యపడకుండా స్వయంకృషితో తన వృత్తినే నమ్ముకొని జీవిస్తోన్న మల్లేశ్... ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి: సోషల్​ మీడియా సత్తా... 'కాన్​జీ బడే'కు అందరూ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.