గుజరాత్ సూరత్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం