ETV Bharat / bharat

తాటి చెట్టుపైనే స్పృహ తప్పాడు.. 2 గంటల తర్వాత.. - kalloli toddy man

రోడ్డు మీద స్పృహ తప్పితేనే కింద పడిపోయి గాయాలవుతాయి. కానీ, కర్ణాటకలో ఓ కల్లు గీత కార్మికుడు తాటి చెట్టు మీద స్పృహ తప్పాడు. అయినా... కింద పడలేదు. దాదాపు రెండు గంటల పాటు చెట్టు మీదే ఉండిపోయాడు. మరి అతడు సురక్షితంగా కిందకెలా వచ్చాడు?

A man Stuck for Two Hours on a Palm tree in Unconscious Manner: A Miracle took Place in Udupi
తాటి చెట్టుపైనే స్పృహ తప్పాడు.. 2 గంటల తర్వాత..
author img

By

Published : Jul 17, 2020, 7:18 PM IST

తాటి చెట్టుపైనే స్పృహ తప్పాడు..

కర్ణాటకలో ఓ చిన్నపాటి అద్భుతమే జరిగింది. తాటి చెట్టుపై స్పృహ తప్పిన కల్లు గీత కార్మికుడు రెండు గంటల పాటు కింద పడలేదు. పైగా ఏ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తనంతట తానే లేచి కూర్చున్నాడు.

ఉడుపి జిల్లా, కల్లోలికి చెందిన సంతోష్​.. 20 ఏళ్లుగా కల్లు గీత పని చేస్తున్నాడు. రోజూలాగే ఉదయం 6.30 గంటలకు తాటి చెట్టెక్కాడు. తీరా చెట్టు పైకి చేరుకున్నాక సొమ్మసిల్లిపోయాడు. దాదాపు రెండు గంటల పాటు చెట్టు మీదే స్పృహ లేకుండా, కదలకుండా ఉండిపోయాడు.

A man Stuck for Two Hours on a Palm tree in Unconscious Manner: A Miracle took Place in Udupi
తాటి చెట్టుపైనే స్పృహ తప్పాడు.. 2 గంటల తర్వాత..

8.30 గంటలకు గ్రామస్థులు అటువైపు వెళ్లారు కానీ, స్పృహతప్పిన సంతోష్​ను గమనించలేదు. ఆ తర్వాత ఓ అరగంటకు గ్రామంలోని ఓ హోటల్​ యజమాని సుధాకర్​ శాల్యన్​ కల్లు కోసం అటువైపు వచ్చాడు. సంతోష్​ చెట్టుపై ఉలుకూపలుకు లేకుండా ఉండడాన్ని గమనించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు.

అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆపస్మారక స్థితిలో ఉన్న సంతోష్​కు తాళ్లు కట్టి, కిందకు దించారు. సుధాకర్​ కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా.. సంతోష్ లేచి కూర్చున్నాడు. తనకేమీ అవ్వనట్టుగా సాధారణంగా మాట్లాడడం మొదలెట్టాడు. అసలు తాటి చెట్టు ఎక్కడమే మహా కష్టం అలాంటిది.. స్పృహ లేకుండా దానిపై రెండు గంటలు కింద పడకుండా ఉండడం నిజంగా ఓ అద్భుతమే అంటున్నారు గ్రామస్థులు.

ఇదీ చదవండి: కర్రల వంతెనతో ప్రకృతికే కొత్త కళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.