ETV Bharat / bharat

అప్పు కోసం బ్యాంక్​లో తుపాకీతో వీరంగం - అప్పు కోసం బ్యాంక్​లో తుపాకీతో వీరంగం

ఓ వ్యక్తి తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి కలకలం సృష్టించిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో జరిగింది. ఎంత ప్రయత్నించినా రుణం మంజూరుకాకపోవడంవల్లనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడి దాడిలో మధ్యవర్తి సహా బ్యాంకు మేనేజర్​కు స్వల్పంగా గాయాలయ్యాయి.

canra bank manger kicked by a man
అప్పు కోసం బ్యాంక్​లో తుపాకీతో వీరంగం
author img

By

Published : Dec 4, 2019, 1:09 PM IST

Updated : Dec 4, 2019, 3:17 PM IST

అప్పు కోసం బ్యాంక్​లో తుపాకీతో వీరంగం

బ్యాంకురుణం మంజూరుకాలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి... మధ్యవర్తి సహా బ్యాంకు అధికారులపై దాడిచేసిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో జరిగింది.

వెట్రివేలన్​ కోయంబత్తూరు కెనరాబ్యాంకు నుంచి రూ.3 లక్షల రుణం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు మధ్యవర్తిగా గుణబాలన్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఎంతకాలమైనా రుణం మంజూరుకానందున వెట్రివేలన్​ ఆగ్రహంతో ఊగిపోయాడు. రహస్యంగా ఓ తుపాకీ తీసుకొని బ్యాంకులోకి ప్రవేశించాడు.

బ్యాంకు అధికారులపైనా..

బ్యాంక్​ మేనేజర్​ గదిలోనే మధ్యవర్తి గుణబాలన్​కు తుపాకీ గురిపెట్టి దాడిచేశాడు వెట్రివేలన్. కొద్ది క్షణాలకు తేరుకున్న బ్యాంకు మేనేజర్​ చంద్రశేఖర్​ వారిని ఆపి, తుపాకీ​ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెట్రివేలన్ ఆయనపైనా దాడిచేశాడు. ఆపేందుకు యత్నించిన సిబ్బందిపైనా విరుచుకుపడ్డాడు. కాసేపటికి వెట్రివేలన్​ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెట్రివేలన్ తెచ్చింది బొమ్మ తుపాకీ అని అనుమానం.

ఇదీ చూడండి: మంచు కొండలు విరిగిపడి ఐదుగురు జవాన్లు మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RUSSIAN EMERGENCY MINISTRY -  AP CLIENTS ONLY
Yakovlevo - 3 December 2019
1. Rescue workers sifting through debris at explosion site ++VERTICAL FOOTAGE++
2. Various of rescue workers sifting through debris at explosion site
STORYLINE:
Russian emergency officials said one person has been killed by a natural gas explosion at an apartment building in south western Russia.
The Emergencies Ministry said they found the victim's body under debris of the four-storey apartment building in Yakovlevo near the city of Belgorod.
The ministry said six other people were hospitalised with injuries after Tuesday's explosion.
Gas explosions are a regular occurrence in Russia, usually linked to poor maintenance and the neglect of safety rules.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 4, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.