కేరళలోని కొల్లం పరిప్పల్లిలో ఘోరం జరిగింది. అన్నం తినడం లేదని తల్లి కొట్టడం వల్ల నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.
దీపు, రమ్య దంపతులకు డియా అనే కుమార్తె ఉంది. రమ్య నర్సుగా పనిచేస్తోంది. అన్నం తినడంలేదని చిన్నారిని కొట్టింది. అయితే పాప అస్వస్థతకు గురికావడం వల్ల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది.
చిన్నారి శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి రమ్యను అదుపులోకి తీసుకున్నారు. పాప తండ్రి దీపును కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఆహారం తీసుకోవడం లేదని మాత్రమే కొట్టానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని రమ్య కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి: అనాథల కథ: భర్తకు తలకొరివి పెట్టిన భార్య