ప్రసాద్... ఓ సాధారణ వ్యక్తి. కేరళ మలప్పురానికి చెందిన మహ్మద్ కుట్టి అనే వ్యాపారవేత్త వద్ద డ్రైవర్. ప్రసాద్ తల్లి కూడా మహ్మద్ ఇంట్లోనే 26 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా.. ఆ కుటుంబమంతా కొన్నేళ్లుగా యజమానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు కూడా ఆ కుటుంబానికి దగ్గరయ్యారు. యజమాని, పనివాళ్లు అనే తేడా లేకుండా కలిసిపోయారు.
ప్రసాద్ కుటుంబం తమ పట్ల దశాబ్దాలుగా చూపిస్తున్న విశ్వాసం, అభిమానానికి ముగ్ధుడయ్యారు కుట్టి. కృతజ్ఞతగా రూ. 6 లక్షలు విలువైన కారును బహుమానంగా ఇచ్చారు. యజమాని ఇచ్చిన అనూహ్య కానుకతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రసాద్ కుటుంబసభ్యులు. కొత్తకారులో ఆనందంగా షికార్లు కొడుతున్నారు.
ఇదీ చదవండి: చక్రాల్లోకి చున్నీ వెళ్లకుండా మార్చేస్తారట!