కరోనాకు సమర్థవంతమైన చికిత్సా విధానం కనుగొనే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). ఇందుకోసం వేర్వేరు పరిశోధనశాలలు, ఆస్పత్రులను ఏకతాటిపైకి తెచ్చి 'సాలిడారిటీ ట్రయల్' నిర్వహిస్తోంది. ఇందులో చేరడానికి భారత్ నుంచి తొమ్మిది ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్).
కొవిడ్-19కు చికిత్సలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ ఆసుపత్రులు ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ఔషధ పరీక్షలు నిర్వహించనున్నాయి.
ఆ ఆస్పత్రులు ఇవే!
రెమ్‌డెసివిర్, లోపెనావిర్, రిటోనావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇంటర్ఫెరాన్ బీటా-లా లోపినావీర్, రిటోనావీర్ ఔషధాలను క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించనున్నారు. ఈ ఔషధ పరీక్షల నిర్వహణకు.. జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్, చెన్నైలోని అపోలో ఆసుపత్రి, అహ్మదాబాద్‌కు చెందిన బీజే మెడికల్ కళాశాల, పౌర ఆసుపత్రి, భోపాల్‌లోని చిరాయు మెడికల్ కళాశాల, తదితర సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీఎంఆర్.
అవి తెలుసుకోవడమే లక్ష్యం..
ఔషధ పరీక్షలకు రోగుల స్పందన ఎలా ఉంది? వ్యాధిపై అవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? అని తెలుసుకోవడం లక్ష్యమని సాలిడారిటీ ట్రయల్ బృందం తెలిపింది.
"ట్రయల్స్‌కు అవసరమైన అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లభించాయి. దేశంలో కొవిడ్-19 రోగులను ఎంచుకుని, ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. దేశవ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 ఔషధ పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలనేది ప్రణాళిక."
-డాక్టర్ షీలా గాడ్‌బోల్, జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థలో అంటువ్యాధులు విభాగం అధిపతి
కనీసం 1500 నమూనాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున 'సాలిడారిటీ ట్రయల్' కు జాతీయ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు షీలా. 'క్లినికల్ ట్రయల్ రోగుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నాం. తొలుత ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కనీసం 1500ల నమూనాలు సేకరిస్తాం' అని షీలా అన్నారు.
ఇదీ చూడండి: కరోనా సహజంగా రాలేదు.. ల్యాబ్‌లోనే తయారైంది: గడ్కరీ