ETV Bharat / bharat

టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ! - భారత్ టీకా న్యూస్

భారత్​లో 80 శాతం మంది ప్రజలు టీకా స్వీకరించేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. విడుదలైన వెంటనే టీకాను తీసుకుంటామని సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తెలిపారు. మరో ఏడాది లోపు వ్యాక్సిన్ స్వీకరిస్తామని 29శాతం మంది పేర్కొన్నారు.

80 per cent of Indians are willing to get vaccinated
టీకా తీసుకునేందుకు 80 శాతం మంది సిద్ధం!
author img

By

Published : Jan 21, 2021, 9:55 AM IST

దేశంలో 80శాతం మంది పౌరులు టీకా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 28 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్ తొలిస్థానంలో నిలిచింది. రష్యాలో 15 శాతం మంది మాత్రమే టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతుండగా.. అమెరికాలో 33 శాతం మంది ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18 మధ్య 33 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది ఈడెల్​మన్ సంస్థ. వ్యాక్సిన్ విడుదలైన వెంటనే స్వీకరించేందుకు 51 శాతం మంది మొగ్గుచూపగా.. 29 శాతం మంది ఏడాది లోపు తీసుకుంటామని తెలిపారు.

విశ్వాసం తగ్గింది..

2020 ప్రథమార్ధం తర్వాత వైద్య రంగం విషయంలో ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని సర్వే పేర్కొంది. మొత్తంగా ప్రభుత్వాలపై నమ్మకం 8పాయింట్ల మేర తగ్గినట్లు తెలిపింది. అదేసమయంలో భారత్​లో సర్కారుపై నమ్మకం రెండు పాయింట్లు క్షీణించి 79 శాతానికి చేరిందని వెల్లడించింది. అయితే వ్యాపార రంగంపై విశ్వాసానికి మాత్రం డోకా లేదని స్పష్టం చేసింది. రికార్డు సమయంలో టీకాను అందుబాటులోకి తేవడం, కరోనా సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగేలా ప్రయత్నించడం వల్ల ఈ రంగం నమ్మకాన్ని చూరగొందని తెలిపింది.

తప్పుడు సమాచార వ్యాప్తి, అపనమ్మకం కరోనా పోరులో అవాంతరాలుగా ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొంది.

హెర్డ్ ఇమ్యునిటీకి అవకాశం

భారత్​ నుంచి వెలువడిన ఫలితాలను ఆసియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసెన్ సంస్థ అధ్యక్షుడు డా. తమోరిష్ కోలే స్వాగతించారు. భారతీయులు టీకా తీసుకునేందుకు మొగ్గుచూపడం ఉత్సాహం కలిగించే విషయమన్నారు. దేశంలో హెర్డ్ ఇమ్యునిటీ త్వరలోనే సాధ్యమయ్యే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి: చిన్నారులకు నాజల్‌ వ్యాక్సిన్‌ ఉత్తమం: ఎయిమ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.