ETV Bharat / bharat

8 రాష్ట్రాల్లోనే 71% కరోనా మరణాలు, కేసులు

author img

By

Published : Nov 29, 2020, 5:31 PM IST

భారత్​లో కొత్తగా బయటపడిన కరోనా కేసులు, మరణాలు కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఒక్కరోజులో నమోదైన 496 కొవిడ్ మరణాల్లో 88 మరణాలతో మహారాష్ట్ర ముందువరుసలో ఉండగా... 52 మంది మృతులతో బంగాల్ తర్వాత స్థానంలో ఉంది.

8 states, UTs reported nearly 71 pc of new COVID-19 deaths in 24-hour span
8 రాష్ట్రాల్లోనే 71 శాతం కరోనా మరణాలు, కేసులు

దేశంలో కరోనా కేసులు, మరణాలు నిలకడగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులో నమోదైన 496 కొవిడ్​ మరణాల్లో కేవలం 8 రాష్ట్రాల్లోనే 71 శాతం నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా 88 మరణాలతో మహారాష్ట్ర ముందువరుసలో ఉండగా... 52 మంది మృతులతో బంగాల్ తర్వాత స్థానంలో ఉందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

అయితే 22 రాష్ట్రాల్లో కొవిడ్ మరణాల రేటు జాతీయ సగటు 1.46శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొంది ఆరోగ్య శాఖ.

ఇతర వివరాలు ఇలా..

  • దేశంలో సుమారు 4 లక్షల 54వేల యాక్టివ్ కేసులున్నాయి.
  • ఒక్కరోజులో మహారాష్ట్రలో యాక్టివ్​లు కేసులు పెరుగుతుండగా... దిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది.
  • గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోనే 70.43 శాతం బయటపడ్డాయి.
  • గడిచిన 24 గంటల్లో 42,298మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. దిల్లీలో అత్యధికంగా 6,512 మంది మహమ్మారిని జయించగా... రికవరీలో కేరళ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: సీరం టీకా వలంటీర్​ ఆరోపణలపై దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.