ETV Bharat / bharat

ముగిసిన 'సార్వత్రికం'... 66శాతం పోలింగ్​ నమోదు!

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు దేశంలోని 61కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 66శాతం పోలింగ్​ నమోదైంది. మొత్తం 542 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరిగింది. దాదాపు 8వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. పశ్చిమ బంగాల్​లో  అన్ని దశల్లోనూ చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. దేశంలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

ముగిసిన సార్వత్రికం
author img

By

Published : May 20, 2019, 5:39 AM IST

Updated : May 20, 2019, 7:36 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న 61కోట్ల మంది

ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక సమరం ఆదివారం ముగిసింది. పశ్చిమ బంగాల్​లో అన్ని దశల్లోనూ ఘర్షణలు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి ఘర్షణలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్​ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు నడుమ సాగిన పోలింగ్​ ఆదివారం జరిగిన ఏడో దశతో ముగిసింది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

61 కోట్ల మంది

దేశంలో 90.99కోట్ల మంది ఓటర్లకు గాను ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 61కోట్ల మంది ఓటు వేశారని అంచనా. ఆదివారం జరిగిన ఏడో విడతలో 64శాతానికి పైగా పోలింగ్​ నమోదైంది.

ఆదివారం విడుదలైన ఎగ్జిట్​పోల్స్..​ భాజపానే మళ్లీ అధికారం చేపడుతుందని తేల్చేశాయి.

ఏడు దశల్లో మొత్తం 542 లోక్​సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 8వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తమిళనాడులోని వెల్లూరు లోక్​సభ స్థానం పోలింగ్​ మాత్రం వాయిదా పడింది.

మొత్తం 66 శాతం

ఏడు దశల్లో నమోదైన ఓటింగ్​ శాతంపై ఎన్నికల సంఘం ఇంకా పూర్తి అధికారిక గణాంకాలను వెల్లడించలేదు. అయితే దాదాపు అన్ని దశల్లో కలిపి 66శాతం నమోదైనట్టు అంచనా. అలాగే 90కోట్ల99లక్షల మంది ఓటర్లకు గాను దాదాపు 61కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్​ శాతాలిలా..

  • తొలి దశ - 69.61 శాతం
  • రెండో దశ - 69.44 శాతం
  • మూడో దశ - 68.40 శాతం
  • నాలుగో దశ - 65.50 శాతం
  • ఐదో దశ - 64.16 శాతం
  • ఆరో దశ - 64.40 శాతం
  • ఏడో దశ - 64.26 శాతం

2014లో..

2014 సార్వత్రిక ఎన్నికల్లో 66.40 పోలింగ్​ శాతం నమోదైంది.

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1854: US Russian Agent Must Credit Content Creator 4211629
Convicted Russian agent Butina appeals for money
AP-APTN-1845: Romania EU Rally AP Clients Only 4211628
Romanians rally to encourage EU voters
AP-APTN-1837: Netherlands Eurovision Winner No access Germany, Netherlands, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4211626
Eurovision winner Duncan Laurence arrives home
AP-APTN-1724: Honduras Plane Crash AP Clients Only 4211622
Five foreigners killed in plane crash in Honduras
AP-APTN-1717: Germany EU Protest 2 AP Clients Only 4211621
Thousands join pro EU rallies in Germany
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 20, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.