ETV Bharat / bharat

50మీల్​ ప్యాక్ ఛాలెంజ్​​​.. మీరూ చేయగలరా?

లాక్​డౌన్​ కారణంగా ఆకలితో అలమటించే పేదలకు, రోజువారి కూలీలకు ఆహారం అందించటమే లక్ష్యంగా దిల్లీ యువత వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 50 మీల్​ప్యాక్​ ఛాలెంజ్​ పేరిట.. బియ్యం, ఆహార ధాన్యాలు అందిస్తూ నిరాశ్రయులకు బాసటగా నిలుస్తున్నారు.

50MealPackChallenge: Youth campaign delivers 5 lakh meals to needy during lockdown
50మీల్​ ప్యాక్ ఛాలెంజ్​​​.. మీరూ చేయగలరా..!
author img

By

Published : Apr 3, 2020, 5:26 PM IST

Updated : Apr 3, 2020, 5:55 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్​డౌన్​ వల్ల రోజువారీ కూలీల ఆకలి తీర్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు దిల్లీ యువత. వీరు ప్రారంభించిన 'హ్యాష్​ట్యాగ్​50మీల్​ప్యాక్​​ఛాలెంజ్​'కు పోలీసులు కూడా సాయం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన వారంలోపే దాదాపు 5 లక్షల మీల్​ ప్యాకెట్లను పేదలకు పంచిపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

50మీల్​ ప్యాక్ ​​ఏమిటి?

నిరాశ్రయులైన పేదలు, వలస కూలీలు, రోజువారీ కూలీలకు ఆహార ధాన్యాలు, 50 మీల్స్​కు సరిపడా బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసర సరకులు పంచిపెట్టేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ 50మీల్ ప్యాక్ ఛాలెంజ్​.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆకలి సమస్యను అధిగమించేందుకు సరికొత్త పద్ధతిని అవలంబించారు నిర్వాహకులు. సరుకులు, ఆహార సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సహాయం తీసుకున్నారు. అలాగే దిల్లీ పోలీసులు, నేషనల్ అగ్రికల్చరల్​ కోఆపరేటివ్​ మార్కెటింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​(ఎన్​ఏఎఫ్​ఈడీ)తో పాటు ఓ పబ్లిక్ సెక్టార్​ అండర్​టేకింగ్​(పీఎస్​యూ) సాయం కూడా తీసుకున్నారు.

Last Updated : Apr 3, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.