ETV Bharat / bharat

అసోం, బిహార్​ల్లో తగ్గిన వరదలు - 159కి చేరిన మృతులు - పునరావాస కేంద్రాలు

అసోం, బిహార్​ల్లో వరదలు తగ్గుముఖం పడుతున్నా... చాలా ప్రాంతాలు వరదనీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మరణించినవారి సంఖ్య 159కి చేరుకుంది. కాజీరంగ నేషనల్​ పార్క్​లో 129 జీవాలు మృత్యువాతపడ్డాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ దళాలు సహాయకచర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి.

అసోం, బిహార్​ల్లో తగ్గుముఖం పడుతున్న వరదలు
author img

By

Published : Jul 21, 2019, 5:21 AM IST

Updated : Jul 21, 2019, 6:17 AM IST

అసోం, బిహార్​ల్లో తగ్గిన వరదలు - 159కి చేరిన మృతులు

బిహార్​, అసోం రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకునే ఉన్నాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

బిహార్​లో...

బిహార్​లో వరద మృతుల సంఖ్య 97కు చేరుకుంది. ఉపముఖ్యమంత్రి సుశీల్​కుమార్​ మోదీ సీతామఢీ జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన సహాయ, పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎడతెగని వర్షాలతో పాటు... ఎగువన ఉన్న నేపాల్​ నుంచి వరదలు రావడం కారణంగా బిహార్​లోని 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

తగ్గుముఖం పడుతోన్న వరదనీరు

అసోంలో వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ 24 జిల్లాలు ఇంకా నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది.

బిహార్​లోని ఈ జలవిలయానికి 1.51 లక్షల హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. 1.32 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. బాధితులను ఆదుకోవడానికి 689 సహాయక శిబిరాలు, 240 సహాయ పంపిణీ కేంద్రాలు వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేశారు.

వన్యప్రాణులు విలవిల

కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో వరదనీటి మట్టం 138 సెం.మీ. కి చేరుకుంది. ఫలితంగా 129 వన్యజీవులు మృతిచెందాయి. వీటిలో 10 ఖడ్గమృగాలు, 62 హాగ్​ జింకలు, 8 సాంబారు జింకలు, 8 అడవి పందులు, 5 చిత్తడి జింకలు, రెండు ముళ్ల పందులు, ఏనుగు, అడవిగేదె మృత్యువాతపడ్డాయి. ఆహారం లేక మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

కర్బీ ఆంగ్లాంగ్​ జిల్లాలో.. ఎత్తైన ప్రదేశానికి చేరుకోవడానికి వెళ్తున్న 16 జింకలు, వాహనాల కిందపడి మరణించాయి. రెండు ఖడ్గమృగాలు, ఆరు జింకలకు జంతు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: మంచు గడ్డలతో వన్యప్రాణుల విందు

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1732: Internet Iran Zarif AP Clients Only 4221351
Zarif: Iran's action was to "uphold int'l maritime rules"
AP-APTN-1721: Vatican Missing Girl 2 AP Clients Only 4221350
Thousands of bones found in underground space
AP-APTN-1652: UK Anti Brexit March No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4221346
Protesters take to streets against Boris and Brexit
AP-APTN-1652: US NY Coney Island Heat Must credit WABC-TV; No access New York; , No use US Broadcast networks; No re-sale, re-use or archive 4221344
The heat is on at New York's Coney Island
AP-APTN-1623: Iran Tanker Seizure No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4221339
Iranian TV shows UK tanker being seized in Strait of Hormuz
AP-APTN-1615: Archive UK Tanker Must credit: Stena Bulk/Tommy Chia 4221342
ARCHIVE of Stena Impero, the tanker seized by Iran
AP-APTN-1603: Italy Venice Tourists Must credit: Comune di Venezia 4221335
Tourists in Venice fined over making coffee
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 21, 2019, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.