ETV Bharat / bharat

రెండు కుటుంబాల మధ్య పబ్​జీ చిచ్చు- ఐదుగురికి గాయాలు

ఉత్తర్​ప్రదేశ్​లోని హసన్​పుర్​ గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్​జీ నేపథ్యంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువురి కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవడం వల్ల ఈ వ్యవహారం హింసకు దారితీసింది. ఒకరిపై ఒకరు.. తుపాకులు, లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

5, including 2 women, injured in clash over PUBG in UP's Shamli
రెండు వర్గాల మధ్య పబ్​జీ 'చిచ్చు'- ఐదుగురికి గాయాలు
author img

By

Published : Aug 25, 2020, 5:34 AM IST

ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీ నేపథ్యంలో మరో వివాదాస్పద ఘటన బయటకు వచ్చింది. పబ్​జీ వల్ల ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం... చివరికి రెండు కుటుంబాల మధ్య హింసకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని షమ్లి జిల్లాలో జరిగింది.

లాఠీలు.. తుపాకులు...

హసన్​పుర్​ గ్రామంలో.. అమన్​, విశాల్​ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్​జీపై వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందులో ఇరువురి కుటుంబసభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. చివరికి అది ఘర్షణకు దారి తీసింది. ఇరువైపుల వారు లాఠీలు, తుపాకులతో హింసకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో గాయపడ్డ ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఇదీ చూడండి:- పబ్​జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సర్కిల్​ ఆఫీసర్​ జితేంద్ర కుమార్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా.. ఘటనాస్థలం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్టు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.