రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందన్న వాదనలకు బలం చేకూర్చింది 'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్' (ఏడీఆర్) తాజా నివేదిక. 17వ లోక్సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో దాదాపు సగం మంది నేరచరితులేనని తేలటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
మొత్తం 539 మంది ఎన్నికైన సభ్యులపై విశ్లేషించిన ఏడీఆర్, అందులో 43 శాతం మంది అంటే 233 మంది ఎంపీలపై నేరారోపణలు ఉన్నాయని తేల్చింది. 2014తో పోల్చుకుంటే ఈ సంఖ్య 26 శాతం పెరిగిందని తెలిపింది.
పార్టీల వారీగా...
పార్టీ | నేరచరితులు | శాతం |
భాజపా | 116 | 39 |
కాంగ్రెస్ | 29 | 57 |
జేడీయూ | 13 | 81 |
డీఎంకే | 10 | 43 |
టీఎంసీ | 9 | 41 |
గత ఎన్నికల్లో...
2014 ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థుల్లో 185 మంది (34 శాతం) నేరచరితులు ఉన్నారు. అందులో 112 మంది ఎంపీలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో 162 మంది (30 శాతం) ఎంపీలపై ఇతర నేర సంబంధ ఆరోపణలు ఉన్నాయి.
204 కేసులతో...
కేరళలోని ఇడుక్కి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దీన్ కురియోకోస్పై అత్యధికంగా 204 కేసులు ఉన్నట్లు పేర్కొంది ఏడీఆర్.