ETV Bharat / bharat

జాబిల్లిపైకి చేరుకునే ప్రయత్నాల్లో 40 శాతం విఫలమే! - నాసా

చందమామను చేరాలని మనిషి చేసిన ప్రయత్నాల్లో దాదాపు 40 శాతం విఫలమయ్యాయి. అంతరిక్ష పరిశోధనలో దిగ్గజమైన అప్పటి యూఎస్​ఎస్ఆర్​.. చంద్రునిపై చేరుకోవడానికి దాదాపు 11 సార్లు వైఫల్యాలను చవిచూశాకే తొలి విజయాన్ని అందుకుంది. అమెరికా సైతం నాలుగుసార్లు ఇంపాక్టర్లు విఫలమైన తర్వాత ఐదో సారి విజయాన్ని సాధించింది. దీన్ని బట్టి జాబిల్లిని ముద్దాడటం ఎంత కష్టతరమైన విషయమనేది తేటతెల్లమవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన అవరోధాల నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి ప్రయోగాలకు సన్నద్ధం కావడం ఇప్పుడు ఇస్రోకు ఎంతో ముఖ్యం.

జాబిల్లిపైకి చేరుకునే ప్రయత్నంలో 40 శాతం విఫలం
author img

By

Published : Sep 7, 2019, 5:05 PM IST

Updated : Sep 29, 2019, 7:07 PM IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గణాంకాల ప్రకారం గత ఆరు దశాబ్దాలుగా చంద్రున్ని చేరుకోవడానికి వివిధ దేశాలు చేసిన మొత్తం ప్రయత్నాల్లో 60 శాతం మాత్రమే విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు చేపట్టిన 109 ప్రయోగాలలో 61 సార్లే విజయం దక్కింది. 48 సార్లు ఓటమి వెక్కిరించింది. 1958 ఆగస్టు నుంచి 1959 నవంబర్ మధ్య అమెరికా, సోవియట్ యూనియన్‌లు చంద్రునిపైకి 14 మిషన్లను ప్రయోగించాయి. ఇందులో కేవలం రష్యా ప్రయోగించిన లూనా-1, లూనా-2, లూనా-3 మాత్రమే విజయం సాధించాయి. చంద్రున్ని చేరుకోవడం అంత సులభంకాదనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రెండు పద్ధతులు..

చంద్రునిపై దిగడానికి రెండు పద్ధతులు ఉంటాయి. అంతరిక్ష నౌక నేరుగా చంద్రున్ని ఢీ కొట్టడం ఒక విధానం. 1959లో సోవియట్ యూనియన్ తొలిసారి లూనా-2ను చంద్రునిపై దింపింది. ఈ మిషన్‌ను ఇంపాక్టర్ అంటారు. ఇక రెండోది సాఫ్ట్ ల్యాండింగ్. దీనిలో అంతరిక్ష నౌక పూర్తి నియంత్రణతో చంద్రునిపై దిగుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం ఈ కోవకే చెందుతుంది. చంద్రునిపైకి తొలి మానవ పరికరాన్ని పంపిన సోవియట్ యూనియన్.. అదే ఉత్సాహంతో సాఫ్ట్ ల్యాండింగ్‌కు 1963 జనవరిలో లూనా-ఈ6 తో ప్రయత్నాలను ప్రారంభించింది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. అప్పటికే అంతరిక్ష ప్రయోగాలలో అమెరికాతో పోటీ పడుతున్న యూఎస్​ఎస్​ఆర్​కు ఇది భావోద్వేగంతో కూడిన అంశంగా మారింది. ఆ తర్వాత జాబిల్లిపైకి వరుస ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 11 ప్రయోగాలు విఫలమయ్యాయి. వీటిలో ఐదుసార్లు విజయం అంచులవరకు వచ్చి బోల్తాపడింది. ఎట్టకేలకు 1966 జనవరి 31న లూనా-9 రూపంలో యూఎస్​ఎస్​ఆర్​ 12వ యత్నంలో విజయం సాధించింది. ఆ తర్వాత కూడా చాలా ల్యాండర్ ప్రయోగాలు విఫలమయ్యాయి. చంద్రునిపైకి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మొత్తం 47 ప్రయోగాలు జరగ్గా......వాటిల్లో 27 మాత్రమే విజయవంతమయ్యాయంటే..... చంద్రునిపై దిగడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

భారత్​ పరిస్థితి మెరుగు..

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగనే చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందున్న ఇజ్రాయిల్ కూడా సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో విఫలం అయింది. గతేడాది ఫిబ్రవరిలో బేర్‌షీట్‌ పేరుతో చంద్రుని పైకి ప్రయోగాన్ని చేపట్టి విఫలమైంది. దీనిని స్పేస్‌ ఎక్స్‌కు చెందిన నౌక అంతరిక్షంలోకి చేర్చింది. బేర్‌షీట్‌ కోసం బ్రిటన్ ఇజ్రాయిల్‌కు సాయం చేసింది. కానీ భారత్ తన సొంత వాహక నౌక అయిన జీఎస్‌ఎల్వీ ద్వారానే చంద్రయాన్‌-2ను అంతరిక్షంలోకి పంపించింది. ఈ రకంగా చూసుకుంటే భారత్ చాలా మెరుగైన స్థితిలోనే ఉందని చెప్పాలి. అందుకే చంద్రయాన్‌-2 ప్రయోగం 95 శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

చిన్నలోపం..భారీ మూల్యం

చిన్న లోపాలు ద్వారా కూడా కొన్నిసార్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రయాన్ -2లో విక్రమ్ ల్యాండర్‌కు చంద్రుడిపై దిగే బాధ్యతను అప్పగించారు. దీనికి అమర్చిన కెమెరా, వంద సెన్సర్లు, ఆన్ బోర్డు కంప్యూటర్, లేజర్ పరికరాల సాయంతో చంద్రుడిపై దిగేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని స్వయంగా నియంత్రించుకొంటూ దిగాలి. ఈ నేపథ్యంలో ఆన్ బోర్డు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌తో సహా ప్రతి అంశం అత్యంత కీలకమైంది. చంద్రుడి వాతావరణాన్ని అంచనా వేస్తూ తయారు చేసిన ఈ సాఫ్ట్ వేర్ లో ఒక్కచోట చిన్న అంచనా తప్పినా ప్రయోగం మొత్తం విఫలం అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త పాఠాలను నేర్పుతుంది.

చంద్రయాన్​-3కి..

ఈ సారి చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్‌లోని లోపాలను గుర్తించి చంద్రయాన్ -3కు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యే అవకాశం ఉంది. దీనిలో రోబోను పంపే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్ ల్యాండింగ్‌ను భారత్ సాధిస్తే ఆ తర్వాత శాంపిల్ రిటర్న్ ప్రయోగాలను చేపట్టే అవకాశం ఉంది. అంటే చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపి అక్కడి నమూనాలను సేకరించి తిరిగి భూమికి తీసుకురావడం అన్నమాట. ఇది విజయవంతమైతే చంద్రుడిపై నుంచి తిరిగి వచ్చే టెక్నాలజీ భారత్ సొంతం అవుతుంది. అప్పుడు మానవసహిత చంద్రయాన్ సాధ్యమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఆశలన్నీ ఆర్బిటర్​పైనే..!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 19 October 2015
1. Medium of Zooey Deschanel and husband Jacob Pechenik posing
2. Medium of Zooey Deschanel and Jacob Pechenik speaking to a reporter and joking about their daughter and how she loves Bill Murray
ASSOCIATED PRESS
Los Angeles, 9 July 2019
3. Medium of Zooey Deschanel, left, and sister Emily Deschanel, right
4. Medium of Zooey Deschanel
STORYLINE:
ZOOEY DESCHANEL SPLITS FROM HUSBAND
Actress Zooey Deschanel has split from her husband of four years, Jacob Pechenik.
They met on the set of the Bill Murray movie "Rock the Kasbah" and share two kids, a daughter named Elsie and a son, Charlie.
In a joint statement issued Friday (6 SEPT. 2019), the "New Girl" actress and Pechenik, a producer, say they are better off as friends and co-parents instead of life partners.
This is Deschanel's second marriage. She was previously married to Death Cab for Cutie frontman Ben Gibbard.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.