మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ జీపు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఘాటీ ఆస్పత్రికి తరలించారు.
ఔరంగాబాద్- జల్నా మార్గంలో సిందఖేద్రాజ్ వైపు వెళ్తున్న క్రమంలో.. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఓ జీపు రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రక్కు ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో కాశీనాథ్ మేస్త్రీ, రవి జాదవ్, సంగీత బూందే, హృషిధర్ టిడ్కే ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:కరోనాకు భారతీయుడు బలి- మలేసియాలో మృతదేహం