ఝార్ఖండ్‌లోని సిమడెగా ప్రాంతంలో నలుగురు నక్సల్స్‌ను అరెస్టు చేశారు పోలీసులు. వారంతా 'పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్ఎఫ్ఐ)' సభ్యులని గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
బానో ఠాణా పరిధిలోని కనరోవాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా నక్సల్స్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శామ్స్ తబ్రీజ్ తెలిపారు. ఒక రైఫిల్‌ను, 8 మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు మరో సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఝార్ఖండ్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి