ETV Bharat / bharat

మహారాష్ట్రలో లక్షకు చేరువలో కరోనా కేసులు - దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణకు అడ్డుకట్ట పడటం లేదు. మొత్తం కేసుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 8వేలకు ఎగబాకింది. వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. తమిళనాడు 38 వేలు, గుజరాత్​లో 22 వేల కేసులు నమోదయ్యాయి.

3,607 new coronavirus cases in Maharashtra, 152 deaths
మహారాష్ట్రలో లక్షకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Jun 11, 2020, 10:20 PM IST

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు​ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,86,579కి చేరింది. 8,102 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 1,37,448 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో 3,607 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. గురువారం మరో 3,607 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో 152 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,590కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 46,078 మంది కోలుకున్నారు.

తమిళనాడులో 349 మంది మృతి..

తమిళనాడులోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే 1,875మందికి పాజిటివ్​గా తేలింది. 23 మంది మృతి చెందారు. వరుసగా 12 రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 38,716కు ఎగబాకింది. వీరిలో 17,659 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 20,705 మంది డిశ్చార్జ అయ్యారు. మృతుల సంఖ్య 349కి ఎగబాకింది.

గుజరాత్​లో 513 కేసులు..

గుజరాత్​లోనూ వైరస్​ కోరలు చాచుతోంది. గడిచిన 24గంటల్లో 513 మందికి కరోనా సోకింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 22,067, మృతుల సంఖ్య 1385కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,573 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బంగాల్​లో 440 కేసులు

బంగాల్​లో గురువారం 440 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య తొమ్మిది వేల 768కి చేరింది. వీరిలో 3988 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 442 మంది మృతి చెందారు.

కర్ణాటకలో 71 మంది మృతి..

కర్ణాటకలో 24 గంటల్లో 204 కేసులను గుర్తించారు. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ఐదుగురు మరణించగా మృతుల సంఖ్య 71కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6వేల 245కు కేసులు నమోదయ్యాయి. ఎగబాకింది.

మొత్తం 544 మందికి

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 544 మంది సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) సిబ్బందికి వైరస్​ సోకింది. వీరిలో 353 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సీఆర్​పీఎఫ్​ చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ సైతం వైరస్ బారిన పడ్డారు. దీంతో అధికారిని చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

  • హరియాణాలో గురువారం 389 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితులు సంఖ్య 6 వేలకు చేరువైంది. వీరిలో 2,260 మందికి వైరస్​ నయం కాగా.. 3644 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 64 మంది మృతి చెందారు.
  • ఉత్తరాఖండ్​లో 75 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 1,637కు ఎగబాకింది. 837 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 15 మంది మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ 83 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,244కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,258 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 133 హాట్​ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
  • రాజస్థాన్​లో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 11,838కి చేరింది. ఇందులో 2,798 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మొత్తం 265 మంది మృతి చెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం బాధితులు సంఖ్య 458కి చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 4,574 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంలో 2,702 మంది చికిత్స పొందుతుండగా, 1,820 మంది కోలుకున్నారు. 52 మంది మృత్యువాతపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.