ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో 32 మంది నక్సల్స్​ లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో 32 మంది నక్సలైట్లు లొంగిపోయారు. మావోయిస్టు భావజాలంతో విసుగు చెందే ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Oct 25, 2020, 5:34 PM IST

32 Naxals surrender in Dantewada of chhattisgarh
జనజీవన స్రవంతిలోకి 32 మంది నక్సల్స్​

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా స్థానిక గ్రామాలకు చెందిన వారే.

లొంగిపోయిన వారంతా పోలీసులపై దాడులు చేయడం, మందుపాత్రలు పేల్చడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ అభిషేక్​ పల్లవ తెలిపారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందచేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాలతో వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.

32 Naxals surrender in Dantewada of chhattisgarh
32 Naxals surrender in Dantewada of chhattisgarh
లొంగిపోయిన మావోయిస్టులు

లొంగిపోయిన వారికి దుస్తులు అందిస్తున్న పోలీసులు

లొంగిపోయిన మావోయిస్టులందరూ వివిధ గ్రూపులకు చెందిన వారు. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన 'లోన్​ వార్రటు' (మీ ఇంటికి తిరిగి రండి) వంటి పునరావాస కార్యక్రమాలు కూడా వారికి నచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందించాం.

-అభిషేక్ పల్లవ, ఎస్పీ

ఇప్పటికే దంతెవాడ పోలీసులు నక్సల్స్​ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం​ నిర్వహిస్తున్నారు.

జూన్​ నుంచి ఇప్పటివరకు 150 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: నాలుక కోసి అమ్మవారికి అర్పించిన యువకుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.