జమ్ము కశ్మీర్ శ్రీనగర్లో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
జూనిమర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో భద్రతా బలాగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. దీనితో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు.
నగరంలో ఇంకా ఉగ్ర కదలికలు ఉన్నందున ముందు జాగ్రత్తగా అంతర్జాల సేవలు నిలిపివేశారు అధికారులు. ప్రజా రవాణాపై అంక్షలు విధించారు. ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: 'గల్వాన్ను ఆక్రమించుకోవాలన్నదే చైనా ప్లాన్'