ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా 3.4 లక్షల మంది వలస కూలీల తరలింపు' - migrant workers news

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు 302 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు 3.4లక్షల మందిని స్వరాష్ట్రాలకు తరలించినట్లు వెల్లడించింది.

Shramik trains
302 శ్రామిక్​ రైళ్లలో 3.4 లక్షల మంది వలస జీవుల తరలింపు!
author img

By

Published : May 9, 2020, 11:20 PM IST

లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు శ్రామిక్​ రైళ్లను నడుపుతోంది కేంద్రం. ఈ క్రమంలో మే 1 నుంచి ఇప్పటి వరకు 302 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మొత్తం 3.4 లక్షల మంది వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యటకులను స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపింది.

దిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం (మే 7న)-61, శుక్రవారం (మే 8న)-53, శనివారం (మే 9న)-34 రైళ్లలో వలస జీవులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

కరోనా విజృంభణతో మార్చి 24 నుంచి ప్యాసింజర్​, మెయిల్​, ఎక్స్​ప్రెస్​ రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. కేవలం అత్యవసర సరకుల రవాణా కోసం గూడ్స్​​ ట్రైన్లు నడుపుతోంది. అయితే.. లాక్​డౌన్​తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వినితి మేరకు మే 1 నుంచి శ్రామిక్​ రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.