ఈ ఏడాది మే నెల వరకు 25కు పైగా కేంద్ర మంత్రిత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 2016లో 199, 2017లో 172, 2018లో 110 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అయినట్లు వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సేవల విస్తరణకు సైబర్ దాడులు సమస్యగా మారయన్నారు రవిశంకర్. ఈ దాడులకు ఓ పరిమితి లేదని, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా జరగే అవకాశముందని చెప్పారు.
సైబర్ దాడుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ ఇచ్చారు రవిశంకర్. దేశంలో విలువైన సమాచార భద్రత కోసం నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్సీఐఐపీసీ)ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ-ఇన్) సైబర్ దాడులపై సమాచారం, సలహాలు ఇస్తుందన్నారు రవిశంకర్.
ఇదీ చూడండి: భాజపా గూటికి 10 మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు