ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేసి, రాత పరీక్షలకే పెద్దపీట వేస్తున్నట్టు కేంద్రంలో ప్రధానమంత్రి కార్యాలయానికి అనుంబంధంగా ఉన్న పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి జితేంద్రసింగ్ శనివారం తెలిపారు. మొత్తం 28 రాష్ట్రాల్లో 23 చోట్ల, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలులో ఉన్నట్లు వెల్లడించారు.
'ఒత్తిడి, భయం తగ్గుతాయి'
2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ చేసిన సూచన మేరకు ఈ సవరణ చేశామని తెలిపారు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్. ఇంటర్వ్యూల రద్దుతో ఆయా కుటుంబాలకు ఒత్తిడి, భయం తగ్గుతాయన్నారు. ఇంటర్వ్యూల్లో ఇచ్చే మార్కులపైన గతంలో పలు ఫిర్యాదులు వచ్చేవని, ఇపుడు పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందన్నారు.
ఇదీ చూడండి:మాదకద్రవ్యాల మహా విపత్తు!