ETV Bharat / bharat

కరోనాను జయించిన 20రోజుల పసికందు - 20 days old baby recovered from corona news

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో 21 మంది చిన్నారులు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. వారిలో 20 రోజుల నవజాత శిశువు కూడా ఉంది. పసికందును ఎల్లవేళలా జాగ్రత్తాగా చూసుకున్న తల్లికి మాత్రం వైరస్​ సోకలేదని వైద్యులు తెలిపారు.

21 children
కరోనాను జయించిన 20 రోజుల నవజాత శిశువు
author img

By

Published : May 11, 2020, 4:50 PM IST

ముంబయి తర్వాత దేశంలో కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతం మధ్యప్రదేశ్​లోని​ ఇండోర్​. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ జిల్లాలో గత రెండు నెలల్లో మొత్తం 21 మంది చిన్నారులు కరోనా వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో 20 రోజుల నవజాత శిశివు కుడా ఉన్నట్లు పేర్కొన్నారు. చిన్నారుల తల్లులు.. వారు కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించినట్లు పేర్కొన్నారు.

ఇండోర్​లోని చాయిత్రం ఆస్పత్రిలో 20 రోజుల శిశువు, రెండు నెలలు, 18 నెలల చిన్నారులు.. గత 15 రోజుల్లో డిశ్చార్జ్​ అయినట్లు సీనియర్ వైద్యులు డా. రష్మి షాద్​ తెలిపారు. చికిత్స అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలో వారికి రెండు సార్లు నెగిటివ్ వచ్చినట్లు వివరించారు. వీరితో పాటు రెండేళ్ల వయసులోపు ఉన్న మరో 18 మంది చిన్నారులు శ్రీ ఔరబిందో ఆస్పత్రి నుంచి గత 45 రోజుల్లో డిశ్చార్జి అయ్యారు.

చిన్నారులంతా రోగ నిరోధక శక్తితోనే వైరస్​పై పోరాడి గెలిచినట్లు వైద్యులు చెప్పారు.

పసికందుకు పాజిటివ్-తల్లికి నెగిటివ్​

20 రోజుల నవజాత శిశువుకు బందువుల నుంచి వైరస్​ సోకింది. ఈ నెల 1న ఆస్పత్రిలో చేరి 9న డిశ్చార్జ్​ అయ్యే వరకు చిన్నారి ఆలనా పాలనా చూసుకున్న తల్లికి మాత్రం వైద్య పరీక్షల్లో వైరస్​ నెగిటివ్​ రావడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. అయితే తల్లులందరూ మాస్కులు ధరించి కనీస జాగ్రత్తలు పాటించడం వల్లే వారికి వైరస్​ సోకలేదని వైద్యులు తెలిపారు. అందరిలాగే చిన్నారులు, తల్లులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇండోర్​లో ఇప్పటివరకు 1,935 కేసులు నమోదయ్యాయి. 90 మంది వైరస్ కారణంగా మరణించారు. 898 మంది కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.