ఉత్తర భారతంలో చలి అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీ చలి గాలులకు అల్లాడిపోతోంది. పొగమంచు తీవ్రంగా ఉండడం రవాణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సోమవారం ఉదయం 11 గంటల తర్వాత కూడా పొగమంచు తీవ్రత అలాగే ఉన్నందున దిల్లీ విమానాశ్రయంలో సర్వీసులు స్తంభించిపోయాయి. దట్టమైన మంచు కారణంగా ఎదురుగా ఏమీ కనపడక దిల్లీ నుంచి వెళ్లే 4 విమానాలను రద్దు చేశారు. 20 ఫ్లైట్లను దారి మళ్లించారు.
విమానాల రాకపోకల్లో మార్పులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి.