జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. తీవ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు అవ్నీరా ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.
ఈ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది.
- ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరుకు భారత్ సాయం కావాలి'