తమిళనాడులో జల్లికట్టు జరుగుతుండగా ఓ భవనం గోడ కూలి ఓ వృద్ధుడితో పాటు ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. క్రిష్ణనగరిలోని నేరాలగిరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి.
ఎలా జరిగిందంటే..
అధికారుల ముందస్తు అనుమతి లేకుండానే గ్రామంలో జల్లికట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకొచ్చారు. కొన్నింటిని వీధుల్లోనే వదిలేశారు. ఎద్దుల కొమ్ములకు కట్టిన బహుమతులను దక్కించుకునేందుకు పోటీదారులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొత్తగా నిర్మించిన భవనం గోడ కూలిపోయింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా జల్లికట్టును కొనసాగించడం గమనార్హం.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యేపై దాడి- వీడియో వైరల్