ETV Bharat / bharat

బాణాసంచా పేలి తునాతునకలైన ట్రాక్టర్​.. ఇద్దరు మృతి - తరన్​ తరన్ జిల్లాలో పేలుడు

పంజాబ్​లో ఘోర ప్రమాదం జరిగింది. తరన్​ తరన్ జిల్లాలోని పాహు గ్రామంలో నగర్​ కీర్తన్​ పేరిట నిర్వహించిన ఊరేగింపులో ట్రాక్టర్​లో బాణాసంచా పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.

firecracker explosion
బాణాసంచా పేలి ఇద్దరు మృతి
author img

By

Published : Feb 8, 2020, 10:01 PM IST

Updated : Feb 29, 2020, 4:39 PM IST

పంజాబ్‌లోని తరన్ తరన్‌ జిల్లాలో ఓ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణాసంచా ఉంచిన ట్రాక్టర్‌లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. పాహు గ్రామంలో నగర్‌ కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహిస్తున్నసమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఊరేగింపు కోసం ట్రాక్టర్‌లో బాణాసంచా తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది. పేలుడుతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ట్రాక్టర్‌ తునాతునకలైంది.

బాణాసంచా పేలి తునాతునకలైన ట్రాక్టర్​.. ఇద్దరు మృతి

క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు..

మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18-19 మధ్య వయస్కులేనని చెప్పారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

ముఖ్యమంత్రి స్పందన..

ఘటనపై పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!

Intro:Body:

sdfgdfg

Conclusion:
Last Updated : Feb 29, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.