ETV Bharat / bharat

అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్​కు చోటు - iisc got qs rankings

ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో మూడు భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది. 'క్యూఎస్​ గ్లోబల్​ ర్యాంకింగ్స్​-2021' జాబితాలో స్థానం సంపాదించి ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్​సీ బెంగళూరు సత్తా చాటాయి.

qs rankings
అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్​కు చోటు
author img

By

Published : Jun 11, 2020, 5:35 AM IST

భారత విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి. 'క్వాక్వారెల్లి సైమండ్స్​ (క్యూఎస్​) ర్యాంకింగ్స్​-2021'లో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్​సీ బెంగళూరు నిలిచాయి. ఈ జాబితాలో గతేడాది 152వ ర్యాంకులో ఉన్న ఐఐటీ బాంబే.. 20 ర్యాంకులు కోల్పోయి 172కు చేరింది. కిందటి సంవత్సరం 182వ స్థానంలో ఉన్న ఐఐటీ దిల్లీ ప్రస్తుతం 193వ ర్యాంకు పొందింది. ఇంతకుముందు 184గా ఉన్న ఐఐఎస్​సీ బెంగళూరు.. ఒక స్థానం కోల్పోయి 185వ స్థానం సంపాదించింది.

మొత్తం వెయ్యి విద్యాసంస్థల జాబితాలో 21 భారత్​కు చెందినవి ఉన్నాయి. గతేడాది 491 ర్యాంకు పొందిన ఐఐటీ గువాహటి 21 స్థానాలు మెరుగుపరుచుకుని 470కి చేరింది.

ఇదీ చూడండి: 'కరాచీలో భారత వాయుసేన జెట్​ల చక్కర్లు!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.