భారత్-బంగ్లాదేశ్ మధ్య అనుసంధానత, ఆర్థిక భాగస్వామ్యంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందని ట్విట్టర్ వేదికగా తెలిపారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. కోల్కతా నుంచి కొద్ది రోజుల క్రితం బయలు దేరిన తొలి కంటైనర్ కార్గో.. బంగ్లాదేశ్ ఛత్తోగ్రామ్ ఓడరేవు మీదుగా అగర్తల చేరుకున్నట్లు వెల్లడించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఈ సంబంధాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
-
🇮🇳-🇧🇩| Another historic milestone in India-Bangladesh connectivity & economic partnership as the first ever container cargo from Kolkata via Chattogram port reaches Agartala.
— Anurag Srivastava (@MEAIndia) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
This will help in further development of the north eastern region. pic.twitter.com/acQ7TSQDeM
">🇮🇳-🇧🇩| Another historic milestone in India-Bangladesh connectivity & economic partnership as the first ever container cargo from Kolkata via Chattogram port reaches Agartala.
— Anurag Srivastava (@MEAIndia) July 23, 2020
This will help in further development of the north eastern region. pic.twitter.com/acQ7TSQDeM🇮🇳-🇧🇩| Another historic milestone in India-Bangladesh connectivity & economic partnership as the first ever container cargo from Kolkata via Chattogram port reaches Agartala.
— Anurag Srivastava (@MEAIndia) July 23, 2020
This will help in further development of the north eastern region. pic.twitter.com/acQ7TSQDeM
ఈ కంటైనర్ కార్గోను గతవారం జెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా.
భారత్-బంగ్లాదేశ్ ఇటీవలి కాలంలో నౌకావ్యాపారంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు 6 ఓడరేవుల్లో వ్యాపారాలు కొనసాగించగా.. గతవారం నుంచి మరో ఐదు నౌకాశ్రయాలకు వీటిని విస్తరించాయి. రెండు దేశాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు క్రూజ్ సేవలను కూడా గతవారం నుంచే ప్రారంభించాయి.