అల్లర్లలో 62 మంది పోలీసుల పాత్రపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ సభ్యుడు గుర్లాడ్ సింగ్ కహ్లోన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసుతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీచేసింది.
1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యానంతరం దిల్లీలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. నాటి హింసలో 2వేల 733మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు గతేడాది జనవరి 11న సిట్ ఏర్పాటు చేసింది.