దేశ సరిహద్దులోని జమ్మూ- కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలకు అదనంగా రూ.1,691 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో జమ్మూ- కశ్మీర్‌లో నిర్మాణాలకు రూ.1351.1 కోట్లను సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో)కు కేటాయిస్తున్నట్టు కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా రూ.340 కోట్లను ఉత్తరాఖండ్‌లో జాతీయ రహదారుల పనులకు కేటాయించింది. నాగాలాండ్‌లో నిర్మాణంలో ఉన్న రహదారులకు ఇప్పటికే మంజూరైన గరిష్ఠ పరిమితిని రూ.1081 కోట్ల నుంచి రూ.1955 కోట్లకు పెంచింది.
ఇదీ చూడండి: కశ్మీర్ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం