ETV Bharat / bharat

కరోనా కలవరం: మహారాష్ట్రలో 3 వేలు దాటిన కేసులు - corona in delhi

భారత్​లో కరోనా వైరస్​ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 12,759కి చేరగా.. మృతుల సంఖ్య 420కి పెరిగింది. మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కేసుల సంఖ్య 2వేలు దాటింది.

COVID-19
భారత్​లో కరోనా వైరస్​ కేసులు
author img

By

Published : Apr 16, 2020, 7:17 PM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 12,759కి పెరిగింది.

COVID-19
దేశవ్యాప్తంగా కరోనా కేసులు

ముంబయిలో 2వేలు దాటిన కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాజధాని ముంబయిలో ఈ వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. ఇవాళ ఒక్కరోజే 107 కేసులు నమోదయ్యాయి. మొత్త రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 3,081కి చేరింది. 187 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్​లో 105 కొత్త కేసులు..

గుజరాత్​లో కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతోంది. నేడు 105 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు సంఖ్య 871కి చేరింది.

ఎంపీలో 110..

మధ్యప్రదేశ్​లో ఈ రోజు 110 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 1120కి చేరింది. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్​లో అత్యధికంగా 696 మందికి కరోనా సోకగా.. 39 మంది మరణించారు.

వెయ్యి కేసులు దాటిన రాష్ట్రాలు..

దేశంలో 5 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.

  1. మహారాష్ట్ర- 3,081
  2. దిల్లీ -1,578
  3. తమిళనాడు- 1,242
  4. రాజస్థాన్​ -1,023
  5. మధ్యప్రదేశ్​- 1,120

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.