తరగతి గదిలో సీట్ల కోసం జరిగిన వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లా శిఖర్పుర్లో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
తరగతి గదిలో తన సీట్లో కూర్చున్నాడని తోటి విద్యార్థిపై కోపం పెంచుకున్నాడు ఓ పదో తరగతి విద్యార్థి. దీంతో తన అంకుల్ దగ్గర ఉన్న లైసెన్సుడు తుపాకీ తీసుకొచ్చి క్లాస్‌లోనే సదరు విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్థి మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపల్... పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండ్ పోలీస్ అధికారి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: పట్టపగలే కాల్చివేత.. పరువు హత్యలేనా?