రాజస్థాన్ జోధ్‌పుర్ లోహ్‌దాత గ్రామంలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని 12 మంది విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 11 మంది మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
జోధ్‌పుర్ గ్రామీణ ఎస్పీ సహా పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం పాకిస్థాన్‌కు చెందినదని, ఇటీవలే జోధ్‌పుర్ వచ్చినట్లు సమాచారం. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.